Site icon vidhaatha

Flipkart Big Saving Days Sale | ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ వచ్చేసింది.. మొబైల్స్‌పై బెస్ట్‌ డీల్స్‌..!

Flipkart Big Saving Days Sale | ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్‌ సమ్మర్‌ సందర్భంగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. ఇప్పటికే అమెజాన్‌ సైతం సమ్మర్‌ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ సైతం బిగ్‌ సేవింగ్‌ డేట్స్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా డీల్స్‌కు సంబంధించిన వివరాలను సైతం వెల్లడించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3న ప్రారంభమై 9వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్లిప్‌కార్ట్‌ సేల్‌ లిస్ట్‌ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో మొబైల్‌పై రూ.27,999 ధరకే అందుబాటులో ఉంది. మోటో ఎడ్జ్ 40 నియో మొబైల్‌ని రూ.19,999కి అందిస్తోంది. మోటో జీ64 ధర రూ.12,999, మోటో జీ34 ధర రూ.9,999కే సొంతం చేసుకునేవీలుంది.

పోకో ఎం6 రూ.7,999కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు పోకో ఎక్స్6 ప్రో, పోకో ఎం6 ప్రో, వీవో టీ3 వంటి తదితర డివైజ్‌ను తక్కువ ధరకు ఇవ్వనున్నట్లు తెలిపింది. పోకో ఎక్స్6 మొబైల్‌ని రూ.17,999.. ఐఫోన్ 12ని రూ.39,499కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. పిక్సెల్ 7ఎ ఫోన్ రూ. 31,999, పిక్సెల్ 8 ఫోన్ రూ.49,999కే అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్-14 రూ.55,999కే ఇవ్వనున్నది. ఐఫోన్ 15పై బెస్ట్‌ డీల్స్‌ ప్రకించింది. నథింగ్ ఫోన్ 2ఎ, పోకో ఎక్స్6 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, వీవో టీ2 ప్రో డివైజ్‌లపై తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ వివరాలు వెల్లడించలేదు. బ్యాంక్ కార్డ్‌లపై ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ అందివ్వబోతున్నది.

Exit mobile version