Site icon vidhaatha

Galaxy Z Flip | రికార్డులు సృష్టిస్తున్న.. గెలాక్సీ Z ఫ్లిప్ 5, ఫోల్డ్ 5 ప్రీ బుకింగ్స్‌

Galaxy Z Flip |

తాము ఇటీవ‌ల విడుద‌ల చేసిన అయిదో త‌రం మ‌డ‌త ఫోన్ల‌కు రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్ వ‌స్తున్నాయ‌ని శాంసంగ్ (Samsung) ఇండియా ప్ర‌క‌టించింది. తొలి 28 గంట‌ల్లోనే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ 5 ఫోన్ల‌కు క‌లిపి ల‌క్ష మంది ప్రీ బుకింగ్ చేసుకున్నార‌ని తెలిపింది.

ఈ ఫోన్ల అమ్మ‌కాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగో త‌రం గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4 ల‌తో పోలిస్తే వీటి ప్రీబుకింగ్స్ 1.7 రెట్లు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. తాజా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, 8 జీబీ, 256 జీబీ వేరియంట్ రూ.99,999కి ల‌భించ‌నుండ‌గా.. 12 జీబీ, 256 జీబీ ధ‌ర‌ రూ.1,54,999గా ఉంది.

ముందుగానే బుక్ చేసుకున్న వారికి రూ. 20 వేల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భించనున్న‌ట్లు శాంసంగ్ ఇండియా ప్ర‌క‌టించింది. అదే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5ను ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి ఈ త‌గ్గింపు రూ.23 వేల వ‌ర‌కు ఉండ‌నుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, శాంసంగ్ లైవ్‌ల్లో ఈ ఫోన్ల‌ను ప్రీ బుకింగ్ చేసుకోవ‌చ్చు.

‘ఈ అద్భుత‌మైన స్పంద‌న మ‌మ్మ‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అత్యుత్త‌మ టెక్నాల‌జీ ద్వారా భార‌త వినియోగ‌దారుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో మేము ఎప్పుడూ వెనక్కి త‌గ్గ‌లేదు’ అని ఈ ప్రీ బుకింగ్ ఒర‌వ‌డిపై మాట్లాడుతూ శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా సీఈఓ జేబీ పార్క్ ఆనందం వ్య‌క్తం చేశారు.

Exit mobile version