Gold Rates | పసిడి ధరలు మళ్లీ పైపైకి కదులుతున్నాయి. వరుసగా రెండోరోజూ ఆదివారం సైతం బంగారం ధర పెరిగింది. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండడంతో సామాన్యులకు ఆందోళనకు గురవుతున్నారు. రాబోయే రోజులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 పెరిగి తులానికి రూ.57,800కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడిపై సైతం రూ.100 పెరిగి తులానికి రూ.63,050 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,580కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,050కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,200కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,050 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు పతనమయ్యాయి. కిలోకు రూ.200 తగ్గి.. రూ.75,500కి తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలోకు రూ.77వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.
వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం..! నేడు మార్కెట్‌లో ధరలు ఇవే..!
పసిడి ధరలు మళ్లీ పైపైకి కదులుతున్నాయి. వరుసగా రెండోరోజూ ఆదివారం సైతం బంగారం ధర పెరిగింది. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండడంతో
Latest News

ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!