Site icon vidhaatha

Credit card | క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇకపై బిల్‌ లేటైనా నో ఓవర్‌ డ్యూ చార్జ్‌..!

Credit card : సాధారణంగా అయితే క్రెడిట్ కార్డు బిల్‌ చెల్లింపులో ఏ మాత్రం ఆలస్యమైనా ఓవర్‌ డ్యూ చార్జీలు వసూలు చేస్తారు. అయితే ఇకపై క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులో ఆలస్యమైనా ఓవర్‌ డ్యూ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఇటీవల క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్బీఐ ఊరటనిచ్చింది. ఇక నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు ఆలస్యమైనా ఓవర్ డ్యూ చార్జీలు వసూలు చేయవద్దని, కార్డు హోల్డర్‌లకు కొంత సమయం ఇవ్వాలని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది.

క్రెడిట్‌ కార్డు కస్టమర్స్‌కు మల్టిపుల్ నెట్‌వర్క్‌ ఆప్షన్స్ ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. రూపే, మాస్టర్ కార్డ్, వీసా లాంటి క్రెడిట్ కార్డులను ఎంచుకునే అవకాశం కస్టమర్లకు కల్పించాలని ఆర్బీఐ పేర్కొన్నది. అయితే ఈ కొత్త నిబంధనలు 2024 సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్ ప్రకారం.. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ ఆలస్యమైనా మూడు రోజుల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ మేరకు బ్యాంకులకు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.

ఆర్బీఐ ఆదేశాల మేరకు క్రెడిట్ కార్డు బిల్ చెల్లించేందుకు కస్టమర్లకు మూడు రోజుల అవకాశం అవకాశం ఇవ్వనున్నారు. అంటే ఉదాహరణకు మే 1న క్రెడిట్ కార్డు బిల్ డ్యూ డేట్ ఉంటే కస్టమర్లు మూడు రోజుల ఆలస్యంగా అంటే మే 4 వరకు కూడా ఎలాంటి లేటు ఫీజు లేకుండా బిల్లు చెల్లించవచ్చు. ఒకవేళ లేటయినా మొత్తం క్రెడిట్ కార్డు అమౌంట్ మీద కాకుండా.. కేవలం అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీదనే ఓవర్‌ డ్యూ చార్జీలు విధించాలని ఆర్బీఐ సూచించింది.

Exit mobile version