Site icon vidhaatha

ఐఐహెచ్ హెల్త్‌కేర్ ‘కేర్. ఫర్ గుడ్’ బ్రాండ్ ఆవిష్కరణ

హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రముఖ ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్లలో ఒకటైన IHH హెల్త్‌కేర్ తమ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. రోగుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన, సమగ్రమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది. IHH హెల్త్‌కేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా 70,000 మంది ఉద్యోగులు, ఆసిబాడెమ్, గ్లీనీగల్స్, ఫోర్టిస్, ఐలాండ్, మౌంట్ ఎలిజబెత్, పాంటై, పార్క్‌వే, ప్రిన్స్ కోర్ట్ వంటి నమ్మకమైన బ్రాండ్‌లను ఒకే  గూటికి చేర్చింది. దీని ద్వారా సంస్థ కేవలం ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా, ప్రజల జీవితాలను మెరుగుపరచడంపై దృష్టిసారిస్తుంది.

ఈ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించిన సందర్భంగా, IHH హెల్త్‌కేర్ కౌలాలంపూర్‌లో తొలిసారిగా “ఫ్యూచర్ హెల్త్.నౌ” అనే సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, వ్యాపార రంగాలకు చెందిన 300 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేషియా ఆరోగ్య మంత్రి యంగ్ బెర్హోర్మత్ డాతుక్ సెరి డాక్టర్ హాజీ జుల్కేఫ్లీ అహ్మద్ మాట్లాడుతూ.. “ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం ప్రజా ప్రయోజనం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక గుణకం, దేశ పెట్టుబడి కూడా” అని పేర్కొన్నారు. IHH వంటి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దేశాన్ని ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో సమగ్ర సంరక్షణ, భవిష్యత్ సంరక్షణ, సుస్థిర సంరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. వివిధ దేశాల్లో IHH సంస్థ స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మలేషియాలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులను అదుపు చేయడానికి, అలాగే సింగపూర్‌లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి డ్రాగన్ బోట్ రేసును స్పాన్సర్ చేయడం వంటి కార్యక్రమాలను కూడా వివరించారు.

Exit mobile version