Group Vs Individual Helath Insurance : వ్యక్తిగత, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్: ఏది బెస్ట్?

వ్యక్తిగత, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లలో దేన్ని ఎంచుకోవాలి? ప్రీమియం, ప్రయోజనాలు, నష్టాలు, పన్ను రాయితీలు వివరంగా తెలుసుకోండి.

Group Vs Individual Helath Insurance

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇందులో ఏది బెస్ట్? ఈ రెండింటిలో దేని ప్రీమియం ఎక్కువ? గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ చేసుకోవచ్చా? గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎంత మంది సభ్యులు ఉండాలి? ఈ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ లలో ఎవరికి ఏది ఉపయోగపడుతోందో తెలుసుకుందాం.

వ్యక్తిగత, గ్రూప్ హోల్త్ ఇన్సూరెన్స్ కు తేడా ఏంటి?

వ్యక్తిగత హెల్త్ బీమాను ఒక వ్యక్తి తన స్వంత అవసరాల కోసం తీసుకుంటారు. ఇక గ్రూప్ హెల్త్ బీమాను యజమాని లేదా సంస్థ తమ ఉద్యోగుల లేదా సభ్యుల కోసం కొనుగోలు చేస్తుంది. గ్రూప్ హెల్త్ బీమాలో ప్రీమియంలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. వైద్య పరీక్షలు అవసరం లేదు. వ్యక్తిగత హెల్త్ బీమాలో కవరేజీని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ను సాధారణంగా ఉద్యోగులు, ఏదైనా సంస్థల్లో పనిచేసే సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పర్సనల్ ఇన్సూరెన్స్ తమ ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అలా ఉండదు. వ్యక్తిగత ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ. వ్యక్తిగత ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో హెల్త్ పరీక్షలు తప్పనిసరి. గ్రూప్ ఇన్సూరెన్స్ సమయంలో హెల్త్ చెకప్ అవసరం లేదు. పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కరికే వర్తిస్తుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కుటుంబసభ్యులకు కూడా వర్తిస్తుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభ, నష్టాలు ఏంటి?

ఉద్యోగులు, ఏదైనా సంస్థలో పనిచేసే సభ్యులు, పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లో చేరిన వెంటనే దీన్ని క్లైయిమ్ చేసుకోవచ్చు. అంటే మీ ఆరోగ్య పరిస్థితులకు తక్షణ కవరేజీ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఉద్యోగి చేరిన సంస్థ నిర్ణయించిన మేరకే ఈ ఇన్సూరెన్స్ విలువ ఉంటుంది. అంటే ఆ సంస్థ రూ. 5 లక్షల వరకే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొంటే అంతవరకే క్లైయిమ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ క్లైయిమ్ చేసుకోవాలంటే జేబులో నుంచి ఖర్చు చేయాల్సిందే. ఇక ఆ సంస్థలో ఉద్యోగం మానేస్తే ఈ ఇన్సూరెన్స్ వర్తించదు. వ్యక్తిగత అవసరాలకు తగినట్టుగా ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించుకోలేం.

పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభ, నష్టాలు ఏంటి?

పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకరికే వర్తిస్తుంది. ఒకే కుటుంబంలో అందరికీ ఇన్సూరెన్స్ కావాలంటే…. కుటుంబ సభ్యులందరికీ కలిపి కొత్త పాలసీ తీసుకోవాలి. పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఖర్చు ఎక్కువ.
తమ అవసరాలకు అనుగుణంగా పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. తక్షణ కవరేజీ ఉండదు. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కొన్ని కొన్ని హెల్త్ సమస్యలకు ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. హెల్త్ పరీక్షలు అవసరం ఉంటుంది. ఉద్యోగం మారినా కూడా ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత కాలం వరకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణాలతో మధ్యలో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ను రెన్యూవల్ చేసుకోకపోతే తిరిగి రెన్యూవల్ చేసుకోకపోతే రెన్యూవల్ చేసుకోనే వెసులుబాటు కూడా ఉంటుంది. వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఆదాయపన్ను చట్టం 80 డి సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీని పొందే వెసులుబాటు కూడా పొందవచ్చు. వ్యక్తిగత, గ్రూప్ ఇన్సూరెన్స్ లలో దేనికదే ప్రత్యేకం. అందుకే ఈ రెండూ పాలసీలున్నా నష్టం లేదు.