Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్‌లలో గత రెండు రోజులుగా నమోదైన వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా.. నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ దాదాపు 47,500 వద్ద ఆరంభమైంది.
ఉదయం 10 గంటలకల్లా సెన్సెక్స్ ఏకంగా 510 పాయింట్లకుపైగా లాభపడింది. దాంతోపాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు కూడా లాభాల్లోనే దూసుకెళ్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లలో పాజిటివ్ ధోరణులు సహా పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్‌లపై ప్రభావం చూపాయి. దాంతో ప్రభుత్వ షేర్లు, మెటల్ షేర్లలో అత్యధిక పెరుగుదల కనిపించింది.
ఈ క్రమంలో BPCL, ITC, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, NTPC కంపెనీల స్టాక్స్ లాభాల్లో ఉండగా.. LTIMindtree, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, లార్సెన్, TATA కన్జూమర్స్ సంస్థల స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 345 పాయింట్లు పతనమై 21,957 వద్ద, సెన్సెక్స్ 1062 పాయింట్లు పడిపోయి 72,404 వద్ద, నిఫ్టీ బ్యాంక్ 533 పాయింట్లు పతనమై 47,487 వద్ద ముగిశాయి.