Silver Gold Price : వెండి ధర రూ.5వేల పెంపు..పసిడి నిలకడ

హైదరాబాద్‌లో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. శనివారం కిలో వెండిపై రూ.5,000 పెరిగి రూ.2,26,000కు చేరింది. బంగారం ధరలు మాత్రం నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Silver and Gold price

విధాత : వెండి ధరలు మరోసారి పెరిగాయి. శనివారం ఒక్క రోజునే కిలో వెండి ధర ఏకంగా రూ.5000పెరిగి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2లక్షల 26,00లకు చేరుకున్నది. ఈ డిసెంబర్ 11న కిలో వెండి ధర రూ.2,09,000ఉండగా..తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ.17వేలు పెరగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు భారీ హెచ్చు తగ్గులకు గురవుతున్నప్పటికి త్వరలోనే కిలో వెండి ధర లక్షన్నర చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిలకడగా పసిడి ధరలు

మార్కెట్ లో ఓ వైపు వెండి ధరలు భారీ పెరుగుదలతో దూసుకుపోతుంటే బంగారం ధరలు మాత్రం స్వల్ప హెచ్చు తగ్గుదలతో సాగుతున్నాయి. శనివారం బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,34,180 వద్ద కొనసాగుతున్నది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,100వద్ద కొనసాగుతున్నది.

ఇవి కూడా చదవండి :

SIR voter deletion|తమిళనాడులో ఎస్ఐఆర్ రగడ..97.37లక్షల ఓట్ల తొలగింపు
ACB cases weakened|సర్కార్ నిర్వాకం..ఏసీబీ కేసుల నిర్వీర్యం

Latest News