Rangeela Re-release : మళ్లీ థియేటర్లలోకి ‘రంగీలా’ సినిమా !

రామ్ గోపాల్ వర్మ క్లాసిక్ మూవీ ‘రంగీలా’ మళ్లీ థియేటర్లలోకి వస్తుంది. నవంబర్ 28న రీరిలీజ్ కానున్న ఈ సినిమా అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది.

Rangeela Re-release

విధాత : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఊర్మిళ మంటోడ్కర్ -ఆమిర్ ఖాన్ జంటగా నటించిన ‘రంగీలా’ సినిమా సినీ పరిశ్రమల్లోని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపుపొందింది. 1995లో విడుదలైన‘రంగీలా’ సినిమాకు సెప్టెంబర్ 9వ తేదీతో 30ఏళ్లు నిండాయి. ఆనాటి కల్ట్-క్లాసిక్ రొమాన్స్ మూవీ రంగీలా 30వ వార్షికోత్సవం సందర్భంగా తిరిగి రీరిలీజ్ చేయబోతుండటం ఆసక్తికరం. నవంబర్ 28వ తేదీన ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి తిరిగి వస్తుంది. రంగీలా రీరిలీజ్ ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ రంగీలా సినిమా హైలెట్స్ తో ఆకట్టుకుంది. రంగీలా రీలిజ్ సమాచారం సినిమా అభిమానులకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఈ సినిమాలోని ప్రతిపాట..సన్నివేశాన్ని రాంగోపాల్ వర్మ తనదైన శైలీలో అద్భుతంగా తీశారు.

ముఖ్యంగా ఊర్మిళ గ్లామర్, డ్యాన్స్‌లు అప్పట్లో యువతను ఉర్రూతలూగించగా…ఆమె కెరీర్ కు రంగీలా సినిమా మైల్ స్టోన్ గా నిలిచింది. ‘రంగీలా రే’ పాటకు ఉర్మిళ డ్యాన్స్ ఆల్ టైమ్ స్పెషల్ గా నిలిచిపోయింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాంగోపాల్ వర్మ ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ..నాగార్జున నటించిన శివ ఈ నెల 14న రీరిలీజ్ అవుతుండగా..ఇదే నెలలో రంగీలా సినిమా కూడా రీరిలీజ్ కానుండటంతో ఆయా సినిమాల అభిమానులు వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.