విధాత : తన సోగ కళ్లతో మత్తెక్కించే చిరునవ్వుతో కట్టిపడేసే అందాల త్రిషను చూస్తే కుర్రకారుకు నిషా తప్పదు. ఈ ముదురు ముద్దు గుమ్మ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ జోష్ పెంచేస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. తరగని అందంతో సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలం 24ఏళ్లుగా హీరోయిన్‌గానే కొనసాగుతున్న త్రిష పొన్నియన్ సెల్వం సినిమాతో వయసుతో పాటు పెరిగిన అందంతో ప్రేక్షక ప్రియులను ఆకట్టుకుంది. గత డిసెంబర్‌లో రాంగీ చిత్రంతో లేడి ఓరియంటెడ్ ప్రయోగం నిరాశ పరిచిన త్రిషకు తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ద రోడ్ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకొచ్చిన త్రిష, విజయ్‌తో కలిసి నటించిన లియో సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. త్వరలో అజిత్‌తో కలిసి విడమూమర్చి సినిమాతో మరోసారి వెండితెరపై మెరువనుంది.
సతురంగ వెట్టై 2, ఐడెంటీటీ, రామ్ పార్ట్ 1, గర్జనై చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది. తెలుగులోనూ చిరంజీవి 156వ సినిమాకు ఎంపికైందని సమాచారం. స్టాలిన్ సినిమా తర్వాత ఇప్పుడు అంటే 17 ఏళ్లకు ఇద్దరు కలిసి నటిస్తున్నారు. తెలుగులో మరికొన్ని సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి. సినిమా గాసిప్స్‌లతో పాటు సోషల్ మీడియాలోనూ త్రిష వార్తల్లో ట్రెండింగ్‌గా ఉంటుంది. ఇటీవల నటుడు రానా త్రిష గురించి చెబుతూ మేమిద్దరం దాదాపు దశాబ్దం నుంచి స్నేహితులమన్నాడు. దీంతో అప్పటి విషయాలు, ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష సోషల్ మీడియాలో పోస్టులు తక్కువే పెట్టిన ఫాలోయింగ్ ఎక్కువ. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 6.2 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం ఆమె పట్ల అభిమానానికి నిదర్శనం.