Dulquer Salmaan | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan | విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), నిర్మాత స్వప్నదత్(Director Swapna Dutt) మర్యాదపూర్వకంగా కలిశారు. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి(Mahanati), సీతారామం(Sita Ramam), లక్కీ భాస్కర్(Lucky Baskhar) వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకాభిమానం సంపాదించారు. ప్రస్తుతం కాంత సినిమాలో భాగ్యశ్రీ బోర్సేతో(Bhagyashri Borse) కలిసి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1950నాటి పిరియాడిక్ కథతో ఈ సినిమా రూపొందుతుంది.

ఇకపోతే ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వారసులుగా సోదరి ప్రియాంక ద‌త్ తో కలిసి ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన మార్క్ ను చూపుతున్న స్వప్న దత్ భారీ చిత్రాల నిర్మాణాలతో తండ్రీ బాటలో సాగుతున్నారు. మహానటి, జాతి రత్నాలు, కల్కి 2898 ఎ.డి వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. త్వరలో యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో మల్టిస్టారర్ తీయబోతున్నారు. స్వప్నదత్ కు విద్యార్థి దశ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పరిచయం ఉండటం విశేషం. ఈ విషయాన్ని గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.