విధాత : తేజా సజ్జా(Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో రూపొందుతున్నయాక్షన్ అడ్వెంచర్ మిరాయ్ మూవీ (Mirai) షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం సినిమాకు కీలకమైన ఓ భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మిరాయ్ టీజర్ (Mirai teaser) ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చేవారం ఒక పాట విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతుంది. షూటింగ్ లో ఉన్న ఫైటింగ్ సన్నివేశాలు..పాట రెండూ కూడా మిరాయ్ (Mirai) లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.
తేజా సజ్జా (Teja Sajja) సూపర్ యోధా పాత్రలో కనిపించే మిరాయ్ (Mirai) సినిమా లో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషలలో సెప్టెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.