Shah Rukh Khan injured | విధాత: బాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan)కు తీవ్ర గాయాలయ్యాయి. కింగ్ సినిమా(‘King’ movie) షూటింగ్ లో ఆయన కండరాలకు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మెరుగైన చికిత్స కోసం అమెరికా తరలించారు. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా..ఆయనకు గాయాలైనట్లుగా కథనాలు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కాలేదు. షారుఖ్ ఖాన్ కు గాయాలవ్వడంతో కింగ్ సినిమాను షూటింగ్ ను వాయిదా వేసినట్లుగా సమాచారం. యాక్షన్ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న కింగ్ సినిమాలో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.