Site icon vidhaatha

ద‌ర్బంగ పేలుళ్ల బాంబు ఎలా త‌యారు చేశారో తెలుసా?

విధాత:చిన్న టానిక్ బాటిల్‌ను బాంబుగా వాడొచ్చ‌ని తెలిస్తే షాక‌వుతారు. అవును.. ద‌ర్బంగ పేలుళ్ల‌లో వాడిన బాంబు ఎలా త‌యారు చేశారో తెలుసుకున్న పోలీసులు కూడా ఇప్పుడు షాక్‌లోనే ఉన్నారు. దర్భంగా బ్లాస్ట్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్లాస్ట్ కోసం అట్ట ముక్క వాడటంతో ప్రమాద తీవ్రత తగ్గింది.

చిన్న టానిక్ బాటిల్‌లో సల్ఫ్యూరిక్ ఆసిడ్, నైట్రిక్ ఆసిడ్, వైట్ షుగర్‌లు అమర్చాలి.. వాటిని అమర్చే క్రమంలో ఒకదానికొకటి అడ్డుగా పేపర్ ముక్క వాడాలని ఐసిస్ ముఖ్యనేత ఇక్బాల్ ఖానా నుంచి నాసిర్ మాలిక్, ఇమ్రన్ మాలిక్‌లకు ఆదేశాలుండగా.. వారు పేపర్‌కు బదులు అట్ట ముక్క వాడారు. ట్రయల్ దశలో పేపర్ వాడటంలో మాలిక్ బ్రదర్స్ విఫలమైయ్యారు. దీంతో చిన్న టానిక్ బాటిల్‌లో అట్ట ముక్క వినియోగించారు. అట్ట ముక్కతో మూడు పేలుడు పధార్థాలు కలవడం ఆలస్యం కావడంతో కాజీపేట, రామగుండం మద్య పేలాల్సిన బాంబు దర్బంగాలో‌ పేలిందని ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది. మంగళవారం కూడా మాలిక్ సోదరులను అధికారులు విచారిస్తున్నారు.

Exit mobile version