సీబీఐటీలో ఉద్యోగుల ఆందోళన … లైంగిక వేధింపులపై నిరసన

గండిపేట సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపుల వ్యవహారంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులను పలు మార్లు హెచ్చరించినా వారి వైఖరి మార్చుకోవడం లేదని, బాధిత మహిళా ప్రొఫెసర్ కన్నీటి పర్యంతమై తన సమస్యను యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

  • Publish Date - June 8, 2024 / 07:29 PM IST

విధాత, హైదరాబాద్ : గండిపేట సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపుల వ్యవహారంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులను పలు మార్లు హెచ్చరించినా వారి వైఖరి మార్చుకోవడం లేదని, బాధిత మహిళా ప్రొఫెసర్ కన్నీటి పర్యంతమై తన సమస్యను యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే యాజమాన్యం, ప్రిన్సిపాల్ నరసింహులు ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అంటూ తేలికగా కొట్టిపారేశారు. దీంతో మహిళా ప్రొఫెసర్ కు న్యాయం చేయాలంటూ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ చాంబర్‌లో అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతుండగా బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్‌పై నుంచి దాటి ప్రిన్సిపాల్‌ బయటికి వెళ్లిపోయిన తీరు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టింది. ఈ సమస్యపై యాజమాన్యం స్పందించే వరకు ఆందోళన విరమించే లేదని ఉద్యోగులు భీష్మించారు.

Latest News