Site icon vidhaatha

Diwali Puja | దీపావళికి లక్ష్మీపూజ చేసుకుంటున్నారా..? పూజలో ఈ వస్తువులు ఉండేలా చేసుకోండి..! లేకపోతే పూజ అసంపూర్ణమే..!

Diwali Puja | దీపావళి వేడుకలకు యావత్‌ దేశం ముస్తాబవుతున్నది. దివ్వెల పండుగ కోసం చిన్నా పెద్ద అందరూ సిద్ధమవుతున్నారు. పండుగ రోజు అందరూ లక్ష్మీపూజ నిర్వహిస్తూ వస్తుంటారు. పూజ చేసుకోవడం వల్ల సిరిసంపదలు కురుస్తాయని భక్తుల నమ్మకం. అదే రోజున లక్ష్మీ అమ్మవారితో పాటు మహాగణపతిని సైతం పూజిస్తుంటారు. అయితే, దీపావళి రోజున నిర్వహించుకునే లక్ష్మీపూజలు కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పండితులు పేర్కొంటున్నారు. లేకపోతే ఆ పూజ అసంపూర్తిగానే మిగులుతుందని.. అనుకున్న ఫలితాలుండవని చెప్పారు. లక్ష్మీపూజలో తప్పనిసరిగా గణపతి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.

అదే సమయంలో ఎర్రటి గుడ్డ, లక్ష్మీ అమ్మవారి ప్రతిమ, వెండి నాణెం, బంగారం, గవ్వలు, తామర గింజలు, పసుపు కుంకుమ, గంధం, కర్పూరం, పచ్చ కర్పూరం, యాలకులు, నాణెలు, బచ్చీసలు, తామర పూవు, గోమతి చక్రాలు, నెయ్యి, తెల్లని స్వీట్‌ ఉండేలా చూసుకోవాలి. ఇక లక్ష్మీపూజలో అమ్మవారి చిత్రపటంతో పాటు విష్ణుమూర్తి చిత్రపటం కూడా ఉండాలి. పండుగ రోజున ఇంట్లో 13 దీపాలను వెలిగించాలి. అలాగే, ఇంటి బయట సైతం దీపాలు పెట్టాల్సిందే.

దీపావళి రోజున అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు తప్పనిసరిగా ప్రీతికరమైన 11 తామర పువ్వులను సమర్పించాలని.. లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలని పండితులు పేర్కొంటున్నారు. ఓం శ్రీం మహా లక్ష్మీయే నమః.. . ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః మంత్రాలను పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక దీపావళికి ముందు రోజు ధనత్రయోదశి, నరక చతుర్ధశి జరుపుకుంటాం. ఆ రోజున యమదీపం వెలిగించే ఆనవాయితీ సైతం ఉన్నది. ఈ దీపం వెలిగించడంతో ఆకస్మిక మరణాలు సంభవించకుండా ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు. దీపావళి రోజున పలుచోట్ల గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం వేడుకలు సైతం నిర్వహిస్తుంటారు.

Exit mobile version