Hanuman | విధాత: హనుమాన్ జయంతి ఉత్సవాల్లో నిజమైన హనుమంతుడే పూజలందుకున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతీయులు వానరాలను హనుమాన్ స్వరూపంగా భావిస్తుంటారు. రామభక్తుడైన హనుమాన్ స్వయంగా ఓ వానరుడిగా వచ్చి గర్భాలయం మూల విరాట్ ముందు ఆసీనులై భక్తుల పూజలందుకోవడం చూసిన నెటిజన్లు జై శ్రీరామ్..జై హనుమాన్ స్మరణలతో భక్తి పూనకాలు పోతున్నారు.
ఏ మాత్రం బెరుకులేకుండా మనుషుల ముందు ఆలయంలో కూర్చుని గదను చేత ధరించి.. భక్తులిచ్చిన పూల మాలలు మెడలో వేసుకుని..సమర్పించిన నైవైద్యాలను ఆరగిస్తూ భక్తులను అనుగ్రహించిన ఆ వానరుడే నిజమైన హనుమా అనుకుంటూ భక్తులు తన్మయత్వంలో పూజాదికాలు నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన అద్భుత దృశ్యం వీడియో వైరల్ గా మారింది. చేతిలో గద, నుదుట సింధూర తిలకం.. మెడలో రుద్రాక్ష మాలలు, పూమాలలతో ఆసీనులైన ఆ వానరం వేషధారణ స్వరూపాలు చూసిన వారెవరైనా నిజమైన హనుమాన్ స్వరూపంగానే భావించక మానరు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సజీవ రామభక్త హనుమాన్ ను చూసి తరించండి మరి.