Site icon vidhaatha

Vastu Tips | డ‌బ్బును ఇంట్లో ఈ దిశ‌లో ఉంచుతున్నారా..? అయితే ఆర్థిక సంక్షోభం త‌ప్ప‌ద‌ట‌.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Vastu Tips | ఉన్న‌త‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని ప్ర‌తి వ్య‌క్తి క‌ల‌లు కంటాడు. అందులో భాగంగా ఆర్థికంగా ఎదిగేందుకు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి డ‌బ్బు( Money )ను పోగు చేసుకుంటాడు. ఇక వ‌చ్చిన ధ‌నాన్ని ఇంట్లో భ‌ద్రంగా దాచుకుంటాడు. కానీ ఆ ధ‌నం కొన్ని సంద‌ర్భాల్లో నీళ్ల‌లా ఖ‌ర్చు అవుతుంటుంది. దీంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇలా డ‌బ్బు ఖ‌ర్చు అవ‌డానికి కార‌ణం వాస్తు నియ‌మాలు( Vastu Tips ) పాటించ‌క‌పోవ‌డమే కార‌ణ‌మ‌ని వాస్తు నిపుణులు( Vastu Experts ) చెబుతున్నారు. వాస్తు ప్ర‌కారం సంపాదించిన డ‌బ్బు( Money )ను ఇంట్లో స‌రైన దిశ‌లో ఉంచితేనే ఆ ధ‌నం కొన్నిరోజుల పాటు నిల్వ ఉంటుంద‌ని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో డ‌బ్బును ఏ దిశ‌లో ఉంచాలి.. ఏ దిశ‌లో ఉంచ‌కూడ‌దో తెలుసుకుందాం.

డ‌బ్బు దాచేందుకు స‌రైన దిశ ఏది..?

వాస్తు శాస్త్ర ప్ర‌కారం డ‌బ్బును ఇంట్లో దాచేందుకు ఉత్త‌మ దిశ నైరుతి అని వాస్తు పండితులు చెబుతున్నారు. నైరుతి దిశ‌లో డ‌బ్బులు, ఆభ‌ర‌ణాలు దాచిపెట్ట‌డం వ‌ల్ల ఆ ఇంట్లో సంప‌ద మ‌రింత పెరుగుతుంద‌ని న‌మ్మ‌కం.

ఏ దిశ‌లో డబ్బును ఉంచ‌కూడ‌దు..?

చాలా మంది ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ డ‌బ్బు దాచిపెడుతుంటారు. ఇలా చేయ‌డం మంచిది కాద‌ని పండితులు చెబుతున్నారు. డ‌బ్బుల‌ను పొర‌పాటున కూడా ప‌డ‌మ‌ర లేదా ద‌క్షిణ దిశ‌లో ఉంచ‌కూడ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ దిశ‌ల్లో డ‌బ్బును దాచ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం త‌లెత్తుతుంద‌ట‌.

ఈ దిశ‌లో ఎలాంటి వ‌స్తువులు పెట్ట‌కూడ‌దు..

వాస్తు శాస్త్రం ప్ర‌కారం.. ఇంటికి తూర్పు, ఉత్త‌రానికి మ‌ధ్య‌న అంటే ఈశాన్య దిశ‌లో ఏదో ఒక వ‌స్తువును పెట్టేస్తుంటారు. అయితే ఈ దిశ‌లో వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ధ‌నం నిల్వ ఉండ‌ద‌ట‌. ఈశాన్య దిశ‌ను ఖాళీగా ఉంచాల‌ట‌. అంతేకాకుండా ఎల్ల‌ప్పుడు శుభ్రంగా ఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి, ఆ ఇంట్లో ఎవ‌రూ కూడా రోగాల బారిన ప‌డ‌ర‌ట‌.

Exit mobile version