Ayodhya | అయోధ్య రామ మందిరంలో దర్బార్‌ ఏర్పాటుకు సన్నాహాలు.. విగ్రహాలను చెక్కే బాధ్యతలు అరుణ్ యోగిరాజ్‌కే..!

Ayodhya | అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరారు. నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తూ దర్శనం చేసుకుంటున్నారు. అయోధ్య రామమందిరంలో గర్భాలయం పనులు పూర్తికావడంతో ఈ ఏడాది జనవరిలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

  • Publish Date - May 13, 2024 / 10:57 AM IST

Ayodhya | అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరారు. నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తూ దర్శనం చేసుకుంటున్నారు. అయోధ్య రామమందిరంలో గర్భాలయం పనులు పూర్తికావడంతో ఈ ఏడాది జనవరిలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయం మొదటి అంతస్తులో రామ్‌ దర్బార్‌ ఏర్పాటుకు సన్నాహాలను ముమ్మరం చేశారు. రామాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో కేవలం బాల రాముడు కొలువు దీరగా.. దర్బార్‌లో సోదరులు, సీతామాత, పరమభక్తుడైన హనుమంతుడితో కలిసి దర్శనం ఇవ్వనున్నారు.

విగ్రహాలను వేర్వేరుగా చెక్కనున్నారు. విగ్రహాలకు ఏయే శిలలను వినియోగించాలో సమాలోచనలు జరుపుతున్నారు. గర్భాలంలో కొలువు దీరిన బాల రాముడి విగ్రహాన్ని కృష్ణ శిలతో తీర్చిదిద్దారు. కర్ణాటక నుంచి తీసుకువచ్చి కృష్ణ శిలపై బాల రాముడి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కారు. తాజాగా దర్బార్‌లో సైతం కృష్ణ శిలతో విగ్రహాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ కృష్ణశిల కోసం అయోధ్య రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ చెన్నై, కర్ణాటక ప్రాంతాల్లో అన్వేషిస్తున్నది. రామలక్ష్మణుల విగ్రహాలను కృష్ణ శిలపై తీర్చిదిద్దనున్నారు. సీతామాతా విగ్రహాన్ని మక్రానా రాతిపై చెక్కనున్నారు. భరత, శత్రుజ్ఞలు, హనుమాన్‌ విగ్రహాలను తెల్లటి రాయితో మలచనున్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరులోగా రాముడి దర్బార్‌ను సిద్ధం చేయాలని ట్రస్ట్‌ నిర్ణయించింది. కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌కు దర్బార్‌లో ఏర్పాటు చేయనున్న విగ్రహాలను చెక్కనున్నారు. రాముడి దర్బార్‌ స్థాపనకు మహాపీఠం సిద్ధమైందని రామాలయ వాస్తుశిల్పి ఆశిష్ సోంపురా చెప్పారు. రామాలయం పూజారులు ప్రతిరోజు ఇక్కడ కూడా ఆరతి పూజలు చేస్తారన్నారు. దర్బారులో విగ్రహం ఏ రంగులో ఉంటుంది.. ఏ రాతితో మలచనున్నారో ఇంకా పూర్తిగా నిర్ణయించలేదని.. ప్రస్తుతం డిజైన్ సిద్ధమవుతోందని టస్ట్ర్‌ వర్గాలు తెలిపాయి.

Latest News