Deepavali | దీపావళి పండుగ( Deepavali Festival ) వస్తుందంటే చాలు.. లక్ష్మీ దేవి( Lakshmi Devi )కి ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు( Devotees ) సిద్ధమవుతుంటారు. ఎందుకంటే.. జీవితంలో గొప్పగా బతకాలని, అందుకు తగినంత సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు. మరి ఈ సంపాదనకు లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం కూడా ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడ్డా కూడా తగిన ప్రతిఫలం ఉండదు. కాబట్టి దీపావళి( Deepavali ) రోజున.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతుంటారు భక్తులు.
అయితే నిత్యం ఆర్థిక సమస్యలతో( Financial Probelms ) బాధపడేవారు, అప్పుల( Debts ) ఊబిలో కూరుకుపోయిన వారు.. దీపావళి( Deepavali ) పర్వదినం రోజున ఈ చిన్న పని చేస్తే.. అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎంతోకాలం నుంచి ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుందట. మరి ఆ చిన్న పనేంటో తెలుసుకుందాం..
ఆ పని ఏంటంటే.. దీపావళి రోజున పెరుగు( Curd )తో స్నానం చేయడమే. అది ఎలా అంటే.. మీరు స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్ల పెరుగును కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఐదు నిమిషాలు అయ్యాక.. పెరుగు కలిపిన నీళ్లతో స్నానం( Bath ) ఆచరించాలి. ఇలా చేయడంతో లక్ష్మీదేవి( Lakshmi Devi )కి ఎంతో ప్రీతిపాత్రమైన స్నానం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా పెరుగుతో స్నానం చేయడంతో.. అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఇక్కడ మీరు తీసుకునేది ఆవు పెరుగు అయితే మరీ మంచిది. అది లభించని పక్షంలో గేదె పెరుగును వాడుకోవచ్చంటున్నారు పండితులు.
మరి దీపావళికి, పెరుగుకు ఏం సంబంధం..?
దీపావళికి, పెరుగుకి అద్భుతమైన సంబంధం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు. అందుకు కారణమేమిటంటే.. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ సమయంలో క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఒక దీపం రూపంలో దీపావళి రోజునే ఉద్భవించిందట. ఇక్కడ పాల సముద్రం అంటే పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులన్నింటికీ సంకేతం. కాబట్టి పెరుగులో లక్ష్మీదేవి ఉంటుందట. అందుకే ఎవరైనా సరే దీపావళి రోజు పెరుగును ఉపయోగించి ఒక ప్రత్యేకమైన విధివిధానం పాటిస్తే ఊహించని విధంగా అదృష్టం కలసివస్తుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగిందని జ్యోతిష్య పండితులు తెలిపారు.