స‌ముద్రంలో దొరికే శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవ‌చ్చా..? లాభ‌మా.. న‌ష్ట‌మా..?

స‌ముద్ర మ‌థ‌న స‌మ‌యంలో 14 ర‌త్నాలు, ల‌క్ష్మీదేవితో పాటు ఇత‌రాల‌తో శంఖం ఉద్భ‌వించింద‌ని పురాణాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి ఇంట్లో శంఖాన్ని పెట్టుకుంటే ల‌క్ష్మీ క‌టాక్షం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. ఈ శంఖాన్ని ఎంతో ప‌విత్ర‌మైందిగా భావిస్తారు.

  • Publish Date - April 22, 2024 / 07:10 AM IST

శంఖం చూడడానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. పూజ‌లు, ప‌విత్ర కార్య‌క్ర‌మాలు ప్రారంభించే ముందు శంఖాన్ని పూరిస్తారు. శంఖాన్ని పూరించ‌డం విజ‌యానికి చిహ్నంగా భావిస్తారు. స‌ముద్రంలో దొరికే ఈ శంఖాన్ని లక్ష్మీదేవీ తోబుట్టువుగా అభివ‌ర్ణిస్తారు. స‌ముద్ర మ‌థ‌న స‌మ‌యంలో 14 ర‌త్నాలు, ల‌క్ష్మీదేవితో పాటు ఇత‌రాల‌తో శంఖం ఉద్భ‌వించింద‌ని పురాణాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి ఇంట్లో శంఖాన్ని పెట్టుకుంటే ల‌క్ష్మీ క‌టాక్షం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. ఈ శంఖాన్ని ఎంతో ప‌విత్ర‌మైందిగా భావిస్తారు. ఇంట్లో శంఖాన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంద‌ని న‌మ్మ‌కం. లాభాలే త‌ప్ప పెద్ద‌గా న‌ష్టాలు లేవు. మ‌రి లాభాలు పొందాలంటే ఈ నియ‌మాలు త‌ప్ప‌కుండా పాటించాల్సిందే.

శంఖాన్ని ఎక్క‌డ ఉంచాలి..?

శంఖాన్ని ఎల్ల‌ప్పుడు పూజ గ‌దిలో మాత్ర‌మే ఉంచాలి. ఎందుకంటే శంఖాన్ని ప‌రిశుద్ధ‌మైన స్థ‌లంలో ఉంచితేనే ఆ ల‌క్ష్మీదేవి క‌టాక్షిస్తుంది. ఎరుపు లేదా ప‌సుపు వ‌స్త్రంలో శంఖాన్ని క‌ప్పి ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ శంఖంలో దుమ్ము చేరకుండా ఉంటుంది. దుమ్ము చేరకుండా ఉన్నపుడు శంఖం దాని పవిత్రతను కోల్పోకుండా ఉంటుంది. పూజలో ఉంచకూడదని అనుకుంటే పూజాసామగ్రితో పాటు భద్రపరుచుకోవచ్చు.

నేల మీద శంఖాన్ని పెట్టొచ్చా..?

శంఖాన్ని నేల‌మీద అస‌లు పెట్ట‌కూడ‌దు. ఎల్ల‌ప్పుడు శంఖాన్ని వ‌స్త్రంలోనే కప్పి ఉంచాలి. శంఖాన్ని నీటితో నింప‌కూడ‌దు. ఖాళీగా ఉంచ‌డం వ‌ల్ల దాని నుంచి శ‌క్తి ఇంట్లో వ్యాపిస్తుంది. ల‌క్ష్మీ, విష్ణు లేదా కృష్ణుడి పాదాల వ‌ద్ద శంఖాన్ని ఉంచ‌డం మంచిది.

ఏ దిక్కున శంఖాన్ని ఉంచాలి..?

శంఖాన్ని ఇంట్లో తూర్పు దిక్కున పెట్టుకోవాలి. తూర్పులో వీలుకాకపోతే వాయవ్యంలో కూడా పెట్టుకోవచ్చు. పూజానంతరం గంగాజలాన్ని శంఖంలో నింపి ఆ నీటిని ఇల్లంతా చిలకరించాలి. ఈ చర్య ఇంటి నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. అప్పుల బెడద తీరి ఇంట్లో సంపద చేరుతుంది. కారణం లేకుండా శంఖాన్ని పూరించకూడదు. పూజకు ముందు, పూజ తర్వాత మాత్రమే శంఖాన్ని పూరించాలి. శంఖ ధ్వని వాతావరణంలో ఉన్న సూక్ష్మజీవులను చంపుతుంది.

Latest News