Bhadrachalam | రాములోరి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. జులై 2 నుంచి భ‌ద్రాద్రిలో బ్రేక్ ద‌ర్శ‌న్

Bhadrachalam | రాములోరి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. భ‌ద్రాచ‌లం రామాల‌యంలో జులై 2వ తేదీ నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌నున్నారు.

  • Publish Date - June 20, 2024 / 10:18 PM IST

Bhadrachalam | భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : రాములోరి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. భ‌ద్రాచ‌లం రామాల‌యంలో జులై 2వ తేదీ నుంచి బ్రేక్ ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌నున్నారు. ఈ మేర‌కు శ్రీ సీతారామ రామ‌చంద్ర స్వామి దేవ‌స్థానం అధికారికంగా ప్ర‌క‌టించింది. బ్రేక్ ద‌ర్శ‌నం స‌మ‌యంలో ఉచిత‌, స్పెష‌ల్ ద‌ర్శ‌నం, అర్చ‌న సేవ‌లు నిలిపివేయ‌నున్నారు.

బ్రేక్ ద‌ర్శ‌నాలు ఉద‌యం 9 నుంచి 9.30 వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 7.30 వ‌ర‌కు క‌ల్పించ‌నున్నారు. బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్‌ను రూ. 200గా నిర్ణ‌యించిన‌ట్లు ఆల‌య ఈవో ఎల్ ర‌మాదేవి ప్ర‌క‌టించారు.

Latest News