Site icon vidhaatha

Bhadrachalam | గోదావరి ఉధృతి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam

విధాత: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి భద్రాచలం వద్ద రెండు హెలికప్టర్లు సిద్దంగా ఉంచామన్నారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ వెనుకకురాకుండా పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని కోరామన్నారు. భద్రాచలం పట్టణంలోకి వచ్చిన నీటిని భారీ మోటార్లు పెట్టి తోడేస్తున్నామన్నారు.

కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో ఉందని రజత్‌ కుమార్‌ తెలిపారు. ఉదయం తో పోలిస్తే ఇన్ ప్లో తగ్గిందన్నారు. మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంత భారీ వరదలు వచ్చిన ఎక్కడ కూడా చెరువులు గండ్లు పడలేదన్నారు. రాష్ట్రంలో 46 వేల పైగా చెరువులు ఉన్నాయని, ఇందులో కేవలం 100 లోపు చెరువులకు మాత్రమే గండ్లు పడ్డాయని తెలిపారు. చెరువులకు పడిన గండ్లను పూడ్చుతున్నామన్నారు.

Exit mobile version