హ‌నుమాన్ జ‌యంతి వేళ‌ ఆ నూనెతో దీపం వెలిగిస్తే.. కోరిన కోరిక‌ల‌న్నీ నెర‌వేరుతాయ‌ట‌..!

ఈ ఏడాది హ‌నుమాన్ జ‌యంతి ఆంజ‌నేయుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన మంగ‌ళ‌వారం నాడు వ‌చ్చింది. కాబ‌ట్టి ఇంత‌టి విశేష‌మైన రోజున హ‌నుమంతుడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే ధైర్యం, విజ‌యం, ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం.. ఇలా ఒక‌టేమిటి అన్ని మ‌న సొంతం అవుతాయి. ఇక కోరిన కోరిక‌లు నెర‌వేరాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఈ నూనెతోనే దీపం వెలిగించాల‌ని పండితులు చెబుతున్నారు.

  • Publish Date - April 22, 2024 / 09:48 PM IST

రామ భక్త హనుమంతుడి జన్మదినోత్సవం సందర్భంగా బజరంగబలిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, ఆంజనేయస్వామిని నిష్ట‌తో పూజించాలి. ఎలాంటి చెడు ప‌నులు చేయ‌రాదు. ఉప‌వాసం ఉంటే ఇంకా మంచిది. ఈ ఏడాది హ‌నుమాన్ జ‌యంతి ఆంజ‌నేయుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన మంగ‌ళ‌వారం నాడు వ‌చ్చింది. కాబ‌ట్టి ఇంత‌టి విశేష‌మైన రోజున హ‌నుమంతుడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే ధైర్యం, విజ‌యం, ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం.. ఇలా ఒక‌టేమిటి అన్ని మ‌న సొంతం అవుతాయి. ఇక కోరిన కోరిక‌లు నెర‌వేరాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఈ నూనెతోనే దీపం వెలిగించాల‌ని పండితులు చెబుతున్నారు.

ఏ స‌మ‌యంలో పూజ చేయాలి..?

మంగ‌ళ‌వారం పొద్దున్నే మేల్కొని అభ్యంగ స్నానం చేయాలి. ఇక హ‌నుమంతుడికి ఇష్ట‌మైన సింధూరం రంగు వ‌స్త్రాల‌ను ధ‌రించాలి. ఈ రంగు దుస్తులు లేక‌పోతే ప‌సుపు రంగు దుస్తులు ధ‌రించొచ్చు. ఆల‌యాల‌కు వెళ్లే వారు ఆల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేయొచ్చు. ఆల‌యాల‌కు వెళ్ల‌లేని వారు ఇంట్లోనూ ఆంజ‌నేయుడి విగ్ర‌హాన్ని ఆరాధించొచ్చు. మంగళవారం ఉదయం 9:03 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు తిరిగి రాత్రి 8:14 నుంచి 9:35 వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు.

ఏ నూనెతో దీపం వెలిగించాలి..?

హ‌నుమంతుడికి పొర‌పాటున కూడా పంచామృతాన్ని నైవేద్యంగా పెట్ట‌కూడ‌దు. వాటితో అభిషేకం కూడా చేయ‌కూడ‌దు. భ‌జ‌రంగ్ బ‌లికి ఇష్ట‌మైన శ‌న‌గ‌ప‌ప్పు, బూందీ ల‌డ్డు స‌మ‌ర్పించ‌డం శుభ‌ప్ర‌దంగా భావిస్తారు. హ‌నుమంతుడికి మ‌ల్లె నూనె దీపం అంటే చాలా ఇష్ట‌మైందిగా పండితులు చెబుతున్నారు. మల్లె నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరిక‌లు త్వ‌ర‌గా నెర‌వేరుతాయ‌ట‌. ఇక ఆవ నూనెలో న‌ల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే శ‌ని దోషం కూడా తొలగిపోతుంద‌ట‌. ఇక హ‌నుమాన్ చాలీసా, సుందరకాండ పఠనం చేస్తే చాలా మంచిది. భజనలు, ఆకు పూజలు, సింధూర పూజలు విశేషంగా చేస్తారు. హనుమంతుని ప్రీతి కోసం వడ మాలలు, అప్పాల మాలలు వంటివి విశేషంగా సమర్పిస్తారు.

ఉప్పుకు దూరంగా ఉండాలి..!

హ‌నుమాన్ జ‌యంతి రోజున వీలైనంత వ‌ర‌కు ఉప‌వాసం ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి. ఉప‌వాసం ఉంటే నిష్ఠ‌గా ఉండాలి. ఒక వేళ ఉప‌వాసం ఉండ‌లేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మంచిది. అయితే ఉప్పు లేదా రాతి ఉప్పుకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ ఒక్క‌రోజు ఉప్పు తిన‌క‌పోవ‌డం మంచిది. మ‌ద్యం, మాంసానికి కూడా దూరంగా ఉండాలి.

Latest News