Site icon vidhaatha

Vastu Tips | ఇంటి మెట్ల కింద బాత్రూమ్ నిర్మించారా..? ఆర్థిక సంక్షోభం త‌ప్ప‌ద‌ట‌..!

Vastu Tips | ఒక వ్య‌క్తి కొత్తింటిని( New House ) నిర్మించుకునే స‌మ‌యంలో.. వాస్తు( Vastu ) ప్ర‌కారం నిర్మించాల‌నుకుంటాడు. అందుకోసం వాస్తు నిపుణుల‌ను( Vastu Experts ) సంప్ర‌దించి.. కొత్త ఇంటి నిర్మాణానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటాడు. ప్ర‌ధానంగా కిచెన్( Kitchen ), బాత్రూమ్( Bathroom ) విష‌యంలో వాస్తు నియ‌మాల‌కు( Vastu Tips ) అనుగుణంగానే వాటిని నిర్మిస్తుంటారు. ఈ రెండింటి విష‌యంలో ఏ య‌జ‌మాని కూడా పొర‌పాటు చేయ‌రు.

కానీ కొన్ని సంద‌ర్భాల్లో స్థ‌లం స‌రిపోక టాయిలెట్ విష‌యంలో త‌ప్ప‌ట‌డుగులు వేస్తుంటారు. కొంచెం స్థ‌లం క‌లిసి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో మెట్ల కింద బాత్రూమ్( Bathroom ) నిర్మిస్తుంటారు. ఇలా నిర్మించ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తి ఏర్ప‌డుతుంద‌ట‌. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ట‌. అంతేకాకుండా వాస్తు దోషం ఏర్ప‌డి.. కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం, శ్రేయ‌స్సును కూడా ప్ర‌భావితం చేస్తుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మెట్ల కింద టాయిలెట్ నిర్మించిన వారు ఈ నియ‌మాలు పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి ఆ నియ‌మాలు ఏంటో తెలుసుకుందాం..

మెట్ల కింద బాత్రూమ్ ఉంటే పాటించాల్సిన నియ‌మాలు ఇవే..

ఉప్పు( Salt )

మెట్ల కింద బాత్రూమ్ ఉంటే టాయిలెట్‌లో ఒక గిన్నె ఉప్పు ఉంచండి. ఆ గిన్నెలోని ఉప్పుని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇలా చేయడం ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది.

వాస్తు యంత్రం( Vastu Yantram )

బాత్రూమ్ మెట్ల కింద ఉంటే.. దానిలో వాస్తు యంత్రం లేదా క్రిస్టల్‌ను ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు కూడా తగ్గుతాయని నమ్ముతారు.

ఇతర పరిష్కారాలు

బాత్రూమ్‌లో నీలిరంగు బకెట్, అద్దం, మొక్క లేదా పెయింటింగ్ ఉంచడం వల్ల ప్రతికూల శక్తిని తగ్గించి సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి.

Exit mobile version