Site icon vidhaatha

హ‌నుమాన్ జ‌యంతి రోజున ఈ వ‌స్తువులు అస‌లు కొనుగోలు చేయొద్దు..!

హ‌నుమాన్ జ‌యంతి రోజున మంచి ప‌నులే చేయాలి. అప్పుడే ఆ ఆంజ‌నేయుడి అనుగ్ర‌హం ల‌భిస్తుంది. ఏవైనా పొర‌పాట్లు చేస్తే మ‌నం చేసే పూజా, ఇత‌ర కార్య‌క్ర‌మాలకు ఫ‌లితం ఉండ‌దు. కాబ‌ట్టి.. హ‌నుమాన్ జ‌యంతి రోజున కొన్ని వ‌స్తువుల‌ను అస‌లు కొనుగోలు చేయ‌కూడ‌దు. ఈ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసినా, ఈ ప‌నులు ప్రారంభించిన ద‌రిద్రం వెంటాడుతుంద‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ విష‌యాలు ఏంటో తెలుసుకుందాం..

న‌లుపు రంగు దుస్తులు..

హ‌నుమాన్ జ‌యంతి మంగ‌ళ‌వారం వ‌స్తుంది క‌నుక‌.. ఆ రోజున పొర‌పాటున కూడా న‌లుపు రంగు దుస్తుల‌ను కొనకూడ‌దు. ధ‌రించ‌కూడ‌దు. అలా చేస్తే హ‌నుమంతుడి అనుగ్ర‌హం ల‌భించద‌ని పండితులు చెబుతున్నారు. కాబ‌ట్టి న‌లుపు రంగు దుస్తుల‌కు దూరంగా ఉంటే మంచిది.

మ‌హిళ‌ల అలంక‌ర‌ణ వ‌స్తువులు..

వివాహిత‌లు కూడా చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. మ‌హిళ‌ల‌కు సంబంధించిన అలంక‌ర‌ణ వ‌స్తువులు కూడా కొనుగోలు చేయ‌కూడ‌దు. అలంక‌ర‌ణ వ‌స్తువులు కొనుగోలు చేస్తే.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇనుము, గాజు సామాగ్రి..

హ‌నుమాన్ జ‌యంతి రోజున ఇనుము, గాజు సామాగ్రిని కూడా అస‌లు కొనుగోలు చేయ‌కూడ‌దు. ఈ రెండింటికి సంబంధించిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడ‌దు. ఇనుము, గాజు సామాగ్రిని కొనుగోలు చేస్తే ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది.

కొత్త ఇంటి నిర్మాణం..

ఇక మంగ‌ళ‌వారం నాడే హ‌నుమాన్ జ‌యంతి వ‌స్తుంది కాబ‌ట్టి కొత్త ఇంటి నిర్మాణ ప‌నులు అస‌లు ప్రారంభించ‌కూడ‌దు. భూమిపూజ, పునాది తవ్వకాల మొదలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు. మంగళవారం రోజున కొత్త ఇల్లు కొనుగోలు కూడా చేయకూడదు.

Exit mobile version