Animals in Dreams | కలలు( Dreams ) చాలా మందికి పడుతుంటాయి. రాత్రి, పగటి పూట కనుకు తీశామంటే చాలు కలలు వస్తుంటాయి. ఈ కలల వల్ల కొందరు ఉలిక్కి పడుతుంటారు. కలల వల్ల శుభ ఫలితాలు లేదా చెడు ఫలితాలు కలగవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలోకి జంతువులు( Animals ) వస్తే శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కానీ ఆ ఒక్క జంతువు మాత్రం కలలోకి వస్తే కొంచెం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. మరి శుభఫలితాలను ఇచ్చే జంతువులు ఏవో తెలుసుకుందాం.
గోమాత ( Cow )
స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో ఆవు( Cow ) కనిపిస్తే అదృష్టంగా చెబుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గోవు పూజనీయమైనది. అలాంటి గోమాత కలలో కనిపిస్తే ఆ వ్యక్తి తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారని స్వప్న శాస్త్రం చెబుతోంది.
మృగరాజు( Lion )
స్వప్న శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తికైనా కలలో సింహం( Lion ) కనిపిస్తే పదవీయోగం, పదోన్నతులు, ఐశ్వర్యం, విజయం లభిస్తాయని అర్థం చేసుకోవాలి.
ఏనుగు( Elephant )
కలలో ఏనుగు( Elephant ) కనిపిస్తే ఆ వ్యక్తికి అతి త్వరలో రాజయోగం పట్టబోతోందని, సంపద పెరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
దున్నపోతు
స్వప్నశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి కలలో దున్నపోతు కనిపిస్తే అతనికి సమీపంలో మృత్యు భయం ఉందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.