Ravi Chettu | శ‌నివారం రావి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

Ravi Chettu | హిందూ సంప్ర‌దాయంలో కొన్ని చెట్ల‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఉసిరి చెట్టును, రావి చెట్టును, శ‌మీ వృక్షాన్ని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తుంటారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ(జ‌మ్మి) వృక్షాన్ని పూజించి త‌మ మొక్కుల‌ను చెల్లించుకుంటుంటారు. అయితే రావి చెట్టుకు మాత్రం ప్ర‌తి శ‌నివారం పూజ‌లు నిర్వ‌హించొచ్చ‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

  • Publish Date - June 29, 2024 / 06:52 AM IST

Ravi Chettu | హిందూ సంప్ర‌దాయంలో కొన్ని చెట్ల‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఉసిరి చెట్టును, రావి చెట్టును, శ‌మీ వృక్షాన్ని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తుంటారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ(జ‌మ్మి) వృక్షాన్ని పూజించి త‌మ మొక్కుల‌ను చెల్లించుకుంటుంటారు. అయితే రావి చెట్టుకు మాత్రం ప్ర‌తి శ‌నివారం పూజ‌లు నిర్వ‌హించొచ్చ‌ని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. శ‌నివారం రావి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి, ప్ర‌త్యేక పూజ‌లు చేస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌.. అంతేకాదు సంతాన యోగం కూడా క‌లుగుతుంద‌ట‌.

అయితే శ‌నివారం తెల్ల‌వారుజామున మేల్కొని, అభ్యంగ‌న స్నానం ఆచ‌రించాలి. అనంత‌రం శుభ్ర‌మైన వ‌స్త్రాలు ధ‌రించి రావి చెట్టు ఉన్న ఆల‌యానికి వెళ్లాలి. ఇక మ‌న కోరిక‌ను మ‌న‌సులో చెప్పుకుని రావి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి పూజ చేయాలి. ఇలా ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం వ‌ల్ల దారిద్య్రం తొల‌గిపోయి, కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయి. ఇక సంతానం లేని వారికి త‌ప్ప‌కుండా సంతానం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు.

రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు చెప్తున్నారు. ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంద‌ట‌. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితాలుంటాయని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. రావిచెట్టు దేవతా వృక్షంగా పరిగణింబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది. అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు సూచిస్తున్నారు.

Latest News