Gajakesari Rajyoga | వేద క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది పితృపక్షం( Pitru Paksha ) భాద్రపద మాసం పౌర్ణమి నుంచి ప్రారంభమైంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన పితృపక్షం ప్రారంభమైంది. ఈ పితృపక్షం సెప్టెంబర్ 21వ తేదీ దాకా కొనసాగనుంది. ఈ మధ్యకాలంలో అంటే 14వ తేదీన చంద్రుడు మిథున రాశి( Gemini )లోకి ప్రవేశించాడు. మిథున రాశిలో ఇప్పటికే దేవ గురువు బృహస్పతి ఉన్నాడు. ఇక గురువు, చంద్రుల కలయిక కారణంగా గజకేసరి రాజ్యయోగం( Gajakesari Rajyoga ) ఏర్పడింది. ఇలా గజకేసరి రాజ్యయోగం పితృపక్షంలో ఏర్పడడం 12 ఏండ్ల తర్వాత. ఈ క్రమంలో మూడు రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభమైంది. మరి ఆ మూడు అదృష్ట రాశులు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
గజకేసరి రాజ్యయోగం కారణంగా కన్యా రాశి వారికి కనక వర్షం కురియనుంది. ఎందుకంటే ఈ రాశి కుండలిలో వృత్తి, వ్యాపారం స్థానంలో రాజయోగం ఏర్పడింది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కవులు, టీచర్లతో పాటు జర్నలిజంతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. పదోన్నతులు కూడా లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా లాభసాటిగా ఉండనున్నాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. దంపతులు అన్యోన్యంగా ఉంటూ ప్రేమను మరింత పొందుతారు. తండ్రితో కూడా బంధం బలోపేతమవుతుంది.
గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు పట్టిందల్లా బంగారమే కానుంది. ఎందుకంటే ఈ రాజయోగం ఈ రాశి వ్యక్తుల ఆదాయం, లాభ స్థానంలో ఏర్పడబోతోంది. అందువల్ల ఈ సమయంలో వీరి ఆదాయంలో అపారమైన పెరుగుదల ఉండవచ్చు. అలాగే కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ సమయంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీల ద్వారా లాభం పొందవచ్చు.
వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడటం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం వీరి సంచార జాతకంలో రెండవ స్థానంలో ఏర్పడుతుంది. అందువల్ల ఈ సమయంలో అప్పుడప్పుడు ఆకస్మికంగా లాభాల అవకాశాన్ని పొందుతారు. అలాగే ఈ యోగా ప్రభావం వల్ల వృషభ రాశి వ్యక్తులు తమ ప్రసంగం మాటల ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రతి పనిని ఉత్సాహంగా చేస్తారు. అదే సమయంలో వ్యాపారవేత్తలు పెట్టుబడుల కోసం రుణం పొందనున్నారు.