Site icon vidhaatha

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి జీవిత భాగ‌స్వామితో మ‌న‌స్ప‌ర్థ‌లు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులూ, అసైన్​మెంట్స్ మొదలు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. సమస్యల నుంచి బయట పడతారు. ఆర్ధికంగా పుంజుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు నూతన అవకాశాలు అందుకుంటారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు కోసం అదనపు శ్రమ అవసరం. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది. పనిపట్ల బాధ్యతతో ఉండాలి. వృథా ఖర్చులు ఉండవచ్చు. డబ్బు ఆచి తూచి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కృషి, పట్టుదలతో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు పొందుతారు. ఆదాయం పెరుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల మీద చేసే ప్రయాణాలు ఫలవంతమవుతాయి. ఓ శుభవార్త ఆనందం కలిగిస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు అందకపోవడంతో నిరాశకు గురవుతారు. ఓ వ్యవహారంలో డబ్బు నష్టం కలుగుతుంది. కుటుంబ కలహాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పట్టుదల, కార్యదక్షతతో అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. కళాకారులు, మీడియా రంగం వారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. ధనలాభం ఉంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా చిన్న చిన్న ఆటంకాలను అధిగమిస్తే పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఏర్పడే సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ప్రణాళికలు వేస్తారు. కోపాన్ని, పరుష మాటలను అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదం. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యం వైపు సూటిగా పయనించి విజయపధంలో పయనిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేముందు పెద్దల సలహాలు తీసుకోండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు ఈ రోజు ఫలప్రదం అవుతుంది. ఇంటి వాతావరణం ఆనందోత్సాహాలతో ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఖర్చులను అదుపు చెయ్యండి. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభతో అభ్దివృద్ధి దిశగా పయనిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ధనలాభం కలుగుతుంది. కీలక వ్యవహారంలో ముందడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనుకోని ఖర్చులు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలకు అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

Exit mobile version