Lizard | ప్రతి ఒక్కరూ గొప్పగా బతకాలని కోరుకుంటారు. అందుకు అదృష్టం కూడా కావాలి. అదృష్టం లేనిది ఎంత కష్టపడ్డా కూడా గొప్పగా బతకలేం. అంతేకాకుండా.. ప్రతిరోజు కూడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, అద్భుతంగా గడిచిపోవాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది పొద్దున్నే నిద్ర లేవగానే తమకు ఇష్టమైన వారిని లేదా వారి ఫొటోలను, లేదా దేవుళ్ల చిత్రపటాలను చూస్తుంటారు. ఇవేకాకుండా పొద్దున్నే లేవగానే తమ ఇంట్లో గోడలపై బల్లులు దర్శనమిస్తుంటాయి. వాటిని కూడా చూస్తుంటారు. మరి బల్లిని చూడడం శుభమా..? అశుభమా..? ఈ కథనంలో తెలుసుకుందాం.
చాలా మంది నివాసాల్లో బల్లులు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. నిద్ర లేవగానే వారికి మొదటగా కపిపించేది బల్లి అయి ఉంటుంది. ఇక ఇవాళ బల్లిని చూశామని చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. ఇవాళ అన్ని అశుభాలే జరిగే అవకాశం ఉందని గందరగోళ పడుతారు. కానీ పొద్దున్నే బల్లిని చూడడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. ఆ రోజు వారు చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారట. మరి ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే గోడపై పాకుతున్న బల్లిని చూడడం వల్ల అన్ని విధాలా శుభాలు కలుగుతాయట. అలా బల్లిని చూసిన వారంతా అదృష్టవంతులే అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అలాగే ఉదయం లేవగానే ఆవును చూడటం చాలా మంచిది. ముఖ్యంగా గోమాత, తల్లి పాలు తాగుతున్న లేగ దూడ విగ్రహం. ఆవును చూడటం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఇది ఇంటిలో ఆనందం, శ్రేయస్సును, చేసే పనుల్లో విజయాన్ని కూడా సూచిస్తుందంట. అందువలన ఎవరు అయితే లేచిన వెంటనే గోమాతను చూస్తారో వారు చాలా అదృష్టవంతులు.
ఎవరు అయితే ఉదయం లేచిన వెంటనే నెమలి కన్నుల చిత్రాలు లేదా, పువ్వులను చూస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందంట. అలాగే ఆ రోజు అనుకోని విధంగా ప్రయోజనాలు పొందుతారు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
