Leopard vs Cow | చిరుత పులిని ఎదురించిన‌ ఆవు.. దెబ్బ‌కు అడ‌వుల్లోకి ప‌రార్.. వీడియో

Leopard vs Cow | మీరు చిన్న‌ప్పుడు ఆవు( Cow ) - పులి( Tiger ) క‌థ విన్నారా..? ఆ క‌థ‌లో నిజాయితీగా ఆవు త‌న బిడ్డ‌కు పాలిచ్చి మ‌ళ్లీ అడ‌వి( Forest )కి చేరుకుని పులి ముందు వాలిపోతుంది ఇప్పుడు న‌న్ను భ‌క్షించ‌మ‌ని. కానీ ఈ క‌థ అందుకు పూర్తి వ్య‌తిరేకం. త‌న బిడ్డ‌ను చంప‌బోయిన చిరుత పులి( Leopard )కి ఓ ఆవు ముచ్చెట‌మ‌లు ప‌ట్టించింది. ఆవు( Cow ) ఎదురు తిరగ‌డంతో.. చిరుత పులి దెబ్బ‌కు అడ‌వుల్లోకి ప‌రారైంది.

Leopard vs Cow | చిరుత పులిని ఎదురించిన‌ ఆవు.. దెబ్బ‌కు అడ‌వుల్లోకి ప‌రార్.. వీడియో

Leopard vs Cow | వ‌న్య మృగాలు( Wild Animals ) అతి భ‌యంక‌ర‌మైన‌వి. క‌నిపించిన ప్ర‌తి జంతువును వేటాడి భ‌క్షించేందుకు య‌త్నిస్తుంటాయి. అలాంటి వ‌న్య మృగాల్లో చిరుత పులి( Leopard ) ఒక‌టి. ఈ చిరుత పులులు ఇత‌ర జంతువుల‌పై( Animals ) దాడులు చేస్తూ.. అతి భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తుంటాయి. ఆ మాదిరిగానే ఓ ఆవు దూడ‌( Calf )పై చిరుత దాడి చేసింది. దాన్ని మెడ‌ను అదిమిప‌ట్టి చంపేందుకు చిరుత య‌త్నించింది. ఆవు దూడ అరుపులు విన్న త‌ల్లి ఆవు( Mother Cow ).. అప్ర‌మత్త‌మైంది. త‌న బిడ్డ ప్ర‌మాదంలో ఉంద‌ని ప‌సిగ‌ట్టిన త‌ల్లి ఆవు( Cow ) ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా, బెద‌ర‌కుండా చిరుత పులిపై తిర‌గ‌బ‌డింది. ఆవు దెబ్బ‌కు.. ఆవు దూడ‌ను వ‌దిలిపెట్టిన చిరుత అడ‌వుల్లోకి ప‌రారైంది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌( Rajasthan )లోని పాలి జ‌వాయి లీప‌ర్డ్ క‌న్జ‌ర్వేష‌న్‌( Pali Jawai leopard conservation )లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో( Social Media ) వైర‌ల్ అవుతుంది.

ఇక త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు ఆవు చేసిన సాహాసాన్ని ప‌లువురు నెటిజ‌న్లు అభినందిస్తున్నారు. త‌ల్లి ఆవు కూడా భ‌య‌ప‌డి వెనుక‌డుగు వేసి ఉంటే ఆవు దూడ ప్రాణాలు పోయేవి అని పేర్కొంటున్నారు. త‌ల్లి ఆవు ఏ మాత్రం ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా బిడ్డ‌ను కాపాడుకోవ‌డం గొప్ప విష‌యమ‌ని కితాబిస్తున్నారు. ఆవును చూడ‌గానే చిరుత పారిపోవ‌డం హైలెట్ అని కొంద‌రు పేర్కొంటున్నారు. పులి బిత్త‌ర చూపులు.. దానిలో వ‌ణుకుకు నిద‌ర్శ‌న‌మ‌ని కొంద‌రు నెటిజ‌న్లు చెబుతున్నారు. మ‌రి మీరు ఓ లుక్కేయండి చిరుత‌ను ఎదురించిన ఆవు వీడియోపై..