Viral | కింగ్ కోబ్రా, ఆవు.. ఫ్రెండ్‌షిప్ భలే ఉందిగా

Viral | King Cobra | Cow
శత్రుజీవులంటూ కొన్ని ఉంటాయి. ఒకదానికి ఒకటి పడదు. అది ప్రకృతి ధర్మం. పాములంటే జనమేకాదు.. జంతువులూ భయపడతాయి. ఇతర జంతువులను పాములు కాటేస్తూ ఉంటాయి. ఊళ్లల్లో పాము కాటేయడంతో ఇంటిలో పెంచుకుంటున్న ఆవులు, గేదెలు మృత్యువాత పడిన సందర్భాలు ఉండే ఉంటాయి. కానీ.. ప్రకృతి నియమానికి విరుద్ధంగా కొన్ని స్నేహాలు అబ్బురపరుస్తుంటాయి.
అరే.. ఇలా జరిగిందేంటని మనల్ని ఆశ్చర్యానికి గురి చేసేలా ఆ సందర్భాలు ఉంటాయి. కోళ్లు.. కుక్కలు, కుక్కలు.. పిల్లులు, పులులు.. సాధు జంతువులు అన్యోన్య స్నేహాన్ని ప్రదర్శించిన వీడియోలు తరచూ నెట్టింట చక్కెర్లు కొడుతూ ఉంటాయి. మూగ జీవుల్లోనూ ఏదో ఒక మూల ఎంతో కొంత ఆప్యాయతలు ఉంటాయా? అనిపించేలా అబ్బురపరుస్తుంటాయి. శత్రు జీవులు కూడా ఎంత స్నేహంతో ఉన్నాయో.. అనిపిస్తుంటాయి. అలాంటి అపురూపమైన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రజాదరణ పొందుతున్నది.
ఆ వీడియోలో ఒక ఆవు (Cow), ఒక కింగ్ కోబ్రా (kingcobra) ఉంటాయి. సాధారణంగా పాములును చూసి ఆవులు, గేదెలు భయపడే అవకాశం ఉంటుంది. సహజంగానే మూగ జీవులు సైతం ప్రమాదాన్ని పసిగట్టగల శక్తిని కలిగి ఉంటాయి. పాముల రూపం, కదలికలు, వాసన.. ఇవన్నీ పశువులకు డేంజర్ సిగ్నల్స్ ఇవ్వొచ్చు. కొన్ని అందుకు భిన్నంగా కూడా వ్యవహరించవచ్చు. కానీ.. ఈ వీడియో చూస్తే కింగ్‌కోబ్రా, ఆవు స్నేహం చేస్తున్నాయా? అనిపిస్తుంది.
ఎందుకంటే.. ఆ గోమాత ఆ పామును బిడ్డను నాకినట్టు నాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ పాము కూడా ఆ ఆప్యాయకరమైన ఆ స్పర్శ బాగుందనుకుందేమో.. అది కూడా దానికి అనుగుణంగానే కదులుతూ ఉంటుంది. ఆవు ఎలాంటి భయం లేకుండా తన మూతిని పాము మూతి దాకా తీసుకెళ్లి మరీ టచ్ చేయడానికి పయత్నం చేస్తుంటుంది. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో పసందైన చర్చలు సాగుతున్నాయి.
శత్రువులతో శాంతి నెలకొల్పుకోవాలని థెరపిస్ట్ సజెస్ట్ చేస్తే.. దానిని ఆచరణలో పెట్టినట్టుంది.. అని ఒక యూజర్ సరదాగా కామెంటాడు! ఆ రెండూ ఫ్రెండ్సేమో.. అని ఒకరు, ఆ గోమాతకు భయంలేదా? అని మరొకరు డౌట్ లేపారు. ఆ రెండు జీవులు ఇంత ప్రశాంతంగా కలిసి జీవిస్తుండటం మానవ మాతృలు నమ్మలేని విషయమని ఒకరు రాశారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
జీహెచ్ఎంసీ కమిషనర్‌పై బదిలీ వేటు? తొమ్మిది జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం?
Hyderabad: టూరిజం ఎండీపై కేసు ఏమైంది? FIR అయినా అరెస్టు ఎందుకు చేయలే!