Virgo Horoscope | ఈ నెల 19న ఉగాది పండుగ( Ugadi Festival ) నేపథ్యంలో కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆయా రాశుల( Zodiac Signs ) వారి జీవితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పండితులు ఆయా రాశుల జాతకాలను చెబుతున్నారు. మరి ముఖ్యంగా కొన్ని రాశులకు ప్రతికూల, కొన్ని రాశులకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఉగాది మరుసటి రోజు నుంచి కొందరు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. కొందరిని దరిద్య్రం వెంటాడనుంది. అయితే ఈ ఒక్క రాశి వారికి మాత్రం ఉగాది తర్వాత చాలా శుభాలు కలగనున్నాయి. పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి కనక వర్షం కురియనుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ రాశేంటో తెలుసుకుందాం.
ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా జరుపుకుంటారు. పండుగ రోజున ఉగాది పచ్చడిని సేవించి, పంచాంగ శ్రవణం వింటారు. దాంతో తమ జీవితాలను, భవిష్యత్‌ను లెక్కలేసుకుంటారు. ఆదాయ, వ్యయాలతో పాటు.. శుభ, అశుభాలను తెలుసుకుని.. అందుకు అనుగుణంగా తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారు. అయితే, ఈ సారి కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అయితే ఉగాది తర్వాత ఈ రాశి వారి మీద లక్ష్మీదేవి కటాక్షం చూపించనుంది. కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లచ్చిందేవి. 12 రాశుల్లో ఒక రాశి వారికి మాత్రం విపరీతంగా కలిసి రానుంది. ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి. అలాగే, ఆచి తూచి అడుగులు వేయడం మంచిది.
ఈ ఉగాది కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మార్చి 19 నుంచి మొదలుకుని డిసెంబర్ 08 వరకు మంచిగా ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జూన్ 22 తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. వైవాహిక జీవితం కూడా మారుతుంది. ఇష్టమైన దేవుళ్ళకు పూజిస్తూ ఉండాలి.అలాగే, మనసులో ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది.
