Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు పెళ్లి కుదిరే ఛాన్స్‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేని మంచి రోజు. దృఢ సంకల్పంతో ఉద్యోగ వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. పెరిగిన సంపద సంతోషం కలిగిస్తుంది. మీ అభివృద్ధి మీ పెద్దలకు సంతృప్తి కలిగిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సౌభాగ్య యోగం ఉంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యవహారంలో ఊహించని ఆర్థిక లాభాలు ఆనందంగా కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనసుకు సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. వృత్తి పరంగా కొత్త ప్రాజెక్టులు రావడం, అదనపు ఆదాయ వనరులు ఏర్పడడంతో సంతోషంగా ఉంటుంది. స్నేహితులను, ప్రియమైన వారిని కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికంగా శుభయోగాలున్నాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆటంకాలు అధిగమిస్తారు. కొత్తగా ఏర్పడే పరిచయాలతో భవిష్యత్తులో లాభపడవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించండి. కుటుంబంలో స్వల్ప కలహాలు ఉండవచ్చు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. పెరిగే ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో గొడవలు అశాంతి కలిగిస్తాయి. పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. మీ ప్రతిభకు, సమర్ధతకు గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేయడానికి శుభప్రదమైన రోజు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఒక వ్యవహారంలో చేయని తప్పుకు నిందలు పడాల్సి వస్తుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో త్వరగా విజయం సిద్ధిస్తుంది. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు. భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికలు చేపడతారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలతో ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంట్లో ఒక శుభకార్యం మూలంగా ఖర్చులు పెరగవచ్చు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యసాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్సాహం, పట్టుదల తగ్గకుండా చూసుకోండి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక వ్యహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. సమయాన్ని వృథా చేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాడం వల్ల మేలు జరుగుతుంది.