మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఆర్థిక అంశాలలో పురోగతి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికీ ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరమైన చికాకు, ఆందోళనలతో అవిశ్రాంతంగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపాన్ని, మాటలను నియంత్రణలో పెట్టుకోండి. చేపట్టిన పనుల్లో తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొత్త పనులకు దూరంగా ఉండండి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొన్ని విచారకరమైన సంఘటనలు జరగవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి సత్ఫలితాలు అందుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మాతృ వర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని ఆనందభరితం చేస్తుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి, ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో కలహాలు పెంచుకోకండి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఎంతగా శ్రమించినా ఫలితం నిరుత్సాహకరంగా ఉంటుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. వివాదాలకు దారితీసే చర్చలకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు మంచి రోజు. బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. అన్ని వైపులా నుంచి శుభ సంకేతాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఈ రోజు మంగళకరమైన రోజు. కుటుంబ సభ్యులతో చేసే ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి. అన్ని వైపులా అదృష్టం ఉండడంతో పట్టిందల్లా బంగారం అవుతుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి కావడం కష్టతరం అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో తీవ్రమైన కృషితోనే ఆశించిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. శత్రువుల నుంచి ఆపద పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమించి ముందుకెళ్తారు. మొహమాటం వల్ల ఖర్చులు పెరగవచ్చు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త పడండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.అన్ని రంగాల వారికి సంపూర్ణ కార్యసిద్ధి ఉంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొహమాటానికి పోయి ఇబ్బంది పడతారు. డబ్బు వృథాగా ఖర్చవుతుంది. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. పదోన్నతుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.