మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. బంధు మిత్రులతో ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. భవిష్యత్తు పట్ల స్పష్టమైన ప్రణాళికతో ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టకాలం నడుస్తోంది. బుద్ధిబలంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు రాబట్టుతారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా అధిగమిస్తారు. మనోధైర్యంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. బుద్ధిబలంతో ఉద్యోగంలో సమస్యలు అధిగమిస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. నూతన వాహన యోగం ఉంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు వ్యాపారపరంగా అదృష్టమైన రోజు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదవీయోగం సూచన ఉంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవానుగ్రహంతో ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. బుద్ధిబలంతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సోమరితనం, బద్దకం పనులకు ఆటంకాలుగా మారుతాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో నష్టం కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత, పట్టుదల ఉంటే విజయం సునాయాసంగా లభ్యమవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందం నింపుతుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితులతో ఒక తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ప్రణాళికతో పూర్తి చేసి మంచి ఫలితాలు రాబట్టుతారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి పరంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభప్రదమైన రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.వ్యాపారులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపారవృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. ఊహించని సవాళ్లు ఎదురుకావచ్చు. సంయమనం పాటించండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.