Site icon vidhaatha

మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు బంగారు భ‌విష్య‌త్‌..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించి పనుల్లో త్వతిరగతిన విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మనోధైర్యంతో, ఉత్సాహంతో పని చేయడం వల్ల ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో బంగారు భవిష్యత్తు ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కాలం సహకరిస్తోంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థికంగా శ్రేష్టమైన సమయం. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రణాళిక లోపంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారులు కీలక పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. ఆర్థిక నష్టం కలగకుండా జాగ్రత్త పడండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎదురవుతారు. ఎట్టి పరిస్థితుల్లో నిగ్రహాన్ని కోల్పోకండి. శాంతం, సహనంతోనే మేలు జరుగుతుంది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. గిట్టనివారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించాలి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న శుభ ఫలితాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో వివిధ మార్గాల ద్వారా డబ్బు అందుతుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి నడుచుకోవాలి. వాహన ప్రమాదాలకు అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరమైన జాగ్రత్తలు తప్పనిసరి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు శుభ ప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తారాబలం అనుకూలిస్తోంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్, ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. కొందరి ప్రవర్తన విచారం కలిగిస్తుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి.

Exit mobile version