మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన పనులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి. సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థిక, ఆరోగ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు వ్యూహాత్మకంగా నడుచుకుంటే నష్టాలు నివారించవచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. గ్రహసంచారం అనుకూలంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ వ్యాపారలలో ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు శాశ్వత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. లక్ష్య సాధనలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలలో ప్రగతి అద్భుతంగా ఉంటుంది. మనోధైర్యంతో చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సవాళ్లు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. శ్రేయోదాయకమైన కాలం కొనసాగుతోంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. అధికారుల అండదండలు ఉంటాయి. వ్యాపారంలో మునుపెన్నడూ లేని లాభాలను అందుకుంటారు. ఒక గొప్ప అవకాశం మీ ఇంటి తలుపు తడుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన కాలం నడుస్తోంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు అధిక ఫలాన్ని ఇస్తాయి. భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల పరిణాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. వృధా ఖర్చులు నివారించండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా నష్టపోవచ్చు. అవమానకర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శారీక శ్రమ పెరిగినప్పటికీ ఫలితాలు మాత్రం ఆనందం కలిగిస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో ఇబ్బంది పడతారు. ప్రతికూల ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సానుకూల దృక్పధంతో ముందుకు సాగితే ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
