Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి అదృష్టం వ‌రిస్తుంది..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సుఖ శాంతిమయంగా గడుస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారంలోను ధనయోగాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో, పెద్దలతో కోపాన్ని అదుపులో ఉంచుకుని నిగ్రహం పాటించాలి. ఉద్యోగ వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆచరణ సాధ్యం కాని ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కీలక నిర్ణయాల విషయంలో సందిగ్దత నెలకొంటుంది. మొహమాటంతో చిక్కుల్లో పడతారు. శుభకార్యక్రమాలకు అనుకూలమైన సమయం.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహాలు అదృష్టకరంగా కొనసాగుతాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆర్థికవృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులను ఇతరుల సహకారంతో పూర్తిచేస్తారు. వ్యాపారంలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. సన్నిహితులతో మంచి సమయం గడపడం సంతృప్తినిస్తుంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. మీ పరుషమైన మాటలతో ప్రియాయమైన వారిని బాధ పెడతారు. వివాదాలు, సమస్యలకు మీరు దూరంగా ఉంటే మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ పరిసరాలు సానుకూల వాతావరణంతో నిండి ఉంటాయి. మీ సంతోషం రెట్టింపు చేసే శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మబుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తెలివిగా నడుచుకోండి. ఖర్చులు అదుపు చేయండి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు గాలి బుడగలా తేలిపోతాయి. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఖర్చుల విషయంలో ఆచి తూచి నడుచుకోండి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు అధిక ఫలాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. నిజాయితితో కృషి చేస్తే వ్యాపారంలో శుభ యోగాలుంటాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర వ్యయం తగ్గిస్తే మంచిది.