Site icon vidhaatha

08.08.2024 గురువారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకండి. వృత్తికి నిపుణులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సున్నితమైన విషయాల పట్ల ఆచి తూచి వ్యవహరిసే మేలు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలుంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.

మిథునం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో కూడా అనిశ్చితి నెలకొంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. కుటుంబంలో స్థిరాస్తులు, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చలు జరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యండి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు చేతికి అందడం శుభసూచకం. చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్ధిక లాభాలు ఉంటాయి. ఊహించని ధనలాభాలు ఉంటాయి.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక వృద్ధి, కుటుంబ సౌఖ్యం పుష్కలంగా ఉంటాయి. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

కన్య

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఎంతో కాలంగా పరిష్కారం కానీ వివాదాలు దైవబలంతో పరిష్కారం కావడంతో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తిలో సవాళ్లు, ఆర్ధిక నష్టాలు చేకూరే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఆఫీసులో హోదా పెరుగుతుంది. పని ప్రదేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలను అందుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. మీ పూర్తి సామర్ధ్యాన్ని వెచ్చించి వృత్తి వ్యాపారాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. స్థానచలనం సూచన కూడా ఉంది.

మకరం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాధారణమైన ఫలితాలే ఉంటాయి. పరిశోధనా రంగం వారికి, సాహితీపరమైన రంగాల వారికి అనుకూలమైన సమయం నడుస్తోంది. బుద్ధిబలంతో, సృజనాత్మకతతో వ్యవహరించి సమాజంలో మీకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం వుంది. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురుకావడంతో కోపం, చిరాకు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. పరుషమైన మీ మాటలతో ఇతరులు భాధపడే అవకాశం వుంది. వీలైనంతవరకూ మంచి మాటలనే మాట్లాడండి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజంలో పేరున్న వ్యక్తుల అండదండలతో వృత్తి వ్యాపారాలలో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో నైపుణ్యాలను మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ కలహాలు చోటు చేసుకునే ఆస్కారముంది.

Exit mobile version