మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక నిర్ణయాలలో ఆచి తూచి అడుగేస్తే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా యోగదాయకమైన సమయం. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. కొన్ని శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలపై దృష్టి సారిస్తే మంచిది. యోగా, ధ్యానం చేయడం వలన ప్రశాంతత కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించేందుకు పట్టుదలతో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరగడంతో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్వబుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. అన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. పట్టుదలతో ముందుకు సాగితే ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి.
ధనుస్సు (Sagittarius)
చేపట్టిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టం కలగవచ్చు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం (Capricorn)
ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు ఫలప్రదంగా ఉంటుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం లాభాలబాటలో పయనిస్తుంది. అన్ని పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వారసత్వపు ఆస్తులు కలిసివస్తాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి పరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకునే అవకాశముంది. పట్టుదలతో ముందడుగు వేస్తే సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.