Site icon vidhaatha

జులై 26 శుక్ర‌వారం.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

శ్రమతో కూడిన విజయం ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం, ఒత్తిళ్లు పెరగవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. పొదుపును పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచిరోజు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది.

వృషభం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యల కారణంగా మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. సన్నిహితుల, శ్రేయోభిలాషుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.

కన్య

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి రోజు కాదు. కోపాన్ని, మాటతీరును అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తమ రంగాల్లో తీరికలేని పనుల్లో నిమగ్నమై ఉంటారు. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొంటారు.

వృశ్చికం

ఈ రోజంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ధన నష్టాలు సంభవిస్తాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై కూడా దృష్టి సారించలేకపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

కుంభం

గ‌త కొంతకాలంగా వేధించిన ఆందోళనల నుంచి బయట పడతారు. పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నందున సహనంతో ఉండడం చాలా అవసరం. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండండి. కుటుంబంలో కలహపూరిత వాతావరణాన్ని నివారించడానికి మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

Exit mobile version