మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా మీరు ఈరోజు చాలా శక్తివంతంగా భావిస్తారు. ప్రారంభించిన పనులన్నీ రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తారు. వృత్తి పరంగా, ఆర్థికంగా కొన్ని శుభవార్తలు వింటారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. లక్ష్య సాధనకు మార్గం సుగమం అవుతుంది. ఆర్థికాభివృద్ధి, సమాజంలో గౌరవం చేకూరుతాయి. వ్యాపారరీత్యా దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యం నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో స్వీయ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతాయి. సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. శత్రుభయం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు రాకుండా ముందుజాగ్రత్తతో నడుచుకోవాలి. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకుంటే ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపడకుండా నిదానంగా వ్యవహరించాలి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సమాజంలో ప్రజాదరణ, అధికారం, గౌరవం పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నూతన వాహనం, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సత్సకల్పంతో చేసే పనులు త్వరగా ఫలిస్తాయి. ఒక సంఘటన మీ మానసిక బలాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు స్థానచలనం కూడా ఉండవచ్చు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. ఆర్థిక పరమైన లాభాలు అందుకుంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృథా ఖర్చులు నియంత్రించండి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో గందరగోళం నెలకొంటుంది. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా పనిఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
