మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఒత్తిడి కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక వ్యవహారాలు చక్కబెడతారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు పాటిస్తే మేలు జరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ఆనందం ఉంటాయి. నూతన వస్తువాహన యోగం ఉంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ఆర్థికంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థిరమైన నిర్ణయాలతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో వృత్తి వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో పనిచేస్తే మేలు జరుగుతుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితం అందుకుంటారు. వ్యాపారంలో పురోగతి కోసం గట్టి ప్రయత్నాలు చేయాలి. సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్తే మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయపరంపర కొనసాగుతుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. వృత్తి పరంగా విశేష ధనలాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు అనుకూల ఫలితాలు వెలువడుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా పూనుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. పనిప్రదేశంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల మోసపూరిత మాటలకు ప్రభావితం కావద్దు. మొహమాటంతో చిక్కుల్లో పడతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహాల అనుకూలతతో ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త అందుకుంటారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి.
