Site icon vidhaatha

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు స్థాన చ‌ల‌నం..!

మేషం (Aries)

మేష రాశివారికి ఇవాళ అంతా శుభ‌మే జ‌రుగుతుంది. ప్ర‌తి ప‌నిలోనూ విజ‌యం సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన వార్త‌లు వింటారు. మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉంటారు. స‌న్నిహితుల‌కు స‌మ‌యం కేటాయిస్తారు. ఆర్థిక ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఉంటుంది.

వృషభం (Taurus)

ఈ రాశివారికి ఇవాళ ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు సంభ‌విస్తాయి. ప‌నుల‌న్నీ అసంపూర్తిగా మిగిలిపోతాయి. ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ఉంటుంది. ఖ‌ర్చులు అదుపులో ఉంచుకోవాలి. ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాలి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి అనుకూలం. అనుకున్న ప‌నుల‌న్నీ స‌కాలంలో పూర్త‌వుతాయి. ఉద్యోగంల ప్ర‌మోష‌న్ ల‌భించే అవ‌కాశం ఉంది. నూత‌న బాధ్య‌త‌లు స్వీక‌రించే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా లాభాలు వ‌రించే అవ‌కాశం ఉంది. ఇంట్లో శుభ‌కార్యాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఖ‌ర్చుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

కర్కాటకం (Cancer)

ఈ రాశివారికి ఇవాళ శుభ‌దినం. స్త్రీ మూల‌కంగా ధ‌న‌లాభం జ‌రిగే అవ‌కాశం ఉంది. విహార యాత్ర‌ల‌కు వెళ్తారు. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

సింహం (Leo)

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ కలహాలకు ఆస్కారం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటంతో చిక్కుల్లో పడే ప్రమాదముంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గౌర‌వం పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగు పడతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థికంగా మీ కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు, పనిఒత్తిడి చికాకు పెడతాయి. కొత్త పనులు చేపట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేయండి. కొందరి ప్రవర్తన మనోవేదన కలిగిస్తుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. గిట్టని వారితో వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్య వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయండి.

ధనుస్సు (Sagittarius)

ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి. కుటుంబ కలహాల వల్ల ప్రశాంతంగా ఉండరు. రోజు మొత్తం అస్థిరమైన కుటుంబ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో గొడవలు పడతారు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు, స్థానచలనం సూచన ఉంది. వ్యాపారులకు కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. నూతనోత్సాహంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. స్నేహితులు, ప్రియమైన వారితో ఒక విహారయాత్రలకు వెళ్తారు.

Exit mobile version