Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి జీవిత భాగ‌స్వామితో మ‌న‌స్ప‌ర్థ‌లు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా ఒక సువర్ణావకాశం నేడు ఎదురయ్యే అవకాశముంది. బంగారు భవిష్యత్తు ఎదురు చూస్తోంది. సమయాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ధనాదాయాలు ఆనందం కలిగిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం, సాహసంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన శిఖరాలు అధిరోహిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన ఆటంకాలు తొలగిపోయాయి. ఇక మీకు సర్వత్రా విజయమే! పితృ సంబంధమైన ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఆర్థికంగా విపరీతమైన లాభాలు ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మంచి చెడులు గుర్తించడంలో అయోమయానికి గురవుతారు. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి పరమైన శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో చేసే పనులు మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి. పరోపకార గుణంతో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు ఆచరణలో పెడతారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వేగవంతంగా లభిస్తాయి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ రంగంలో శుభవార్తలు వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీరికలేని పనులతో ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. కీలక సమావేశాలు, చర్చల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థికంగా పరీక్షా సమయం. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభప్రదమైన సమయం నడుస్తోంది. వృత్తి పరంగా మీ పట్టుదల ఫలిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. తలపెట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి పరమైన ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతారు. పట్టుదలతో శ్రమిస్తే సకాలంలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో అవరోధాలు ఉండవచ్చు కాబట్టి వాయిదా వేస్తే మంచిది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఆర్థికంగా, వృత్తి పరంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ప్రయాణాలు సఫలమవుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరోపకార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధికార పరిధి పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలుండవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి.

Latest News