న్యూఢిల్లీ : ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జన గణనకు రూ.11,718కోట్ల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. 2027లో రెండు విడతల్లో డిజిటల్ టెక్నాలాజీతో జన గణన చేపట్టాలని నిర్ణయించింది.
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’గా పేరు మార్చింది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం పనిదినాల్లోనూ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్ఠంగా ఉన్న 100 పనిదినాలను 125 రోజులకు పెంచింది. రోజు కూలీ రూ.240గా నిర్ణయించింది. బొగ్గు గనుల్లో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Akhanda 2 | బాక్సాఫీస్‌పై ‘అఖండ 2’ తుపాను… సినిమా చూసి వచ్చి బాలయ్యకి అభిమాని ఫోన్
