మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన, చురుకైన ధోరణితో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం ఆనందం కలిగిస్తుంది. అధికారుల ప్రశంసలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో విభేదాలు తొలగి బంధాలు బలపడతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలతో ఈ రోజంతా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబంలో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు వ్యాపారులకు చాలా అదృష్టమైన రోజు. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సహచరుల సహకారంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని ఆటంకాలు ఎదురైనా సహనం, పట్టుదలతో ముందుకెళ్తే విజయం మీదే! ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించడం అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఆశించిన ఫలితాలు సిద్దించే వరకు మీ ప్రయత్నాలు ఆపవద్దు. అధిక ఖర్చులతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఒత్తిడి కలిగిస్తాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుతారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థిక పరమైన చిక్కులు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు చేపడతారు. వ్యాపారంలో శుభ ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. భూ, ధనలాభాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మిత్రుల సహకారంతో లాభాలు పెరుగుతాయి. మనోబలంతో తీసుకునే నిర్ణయాలతో విజయావకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆచి తూచి అడుగేయాలి. శుభకార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు. సమాజంలో గౌరమర్యాదలు పెరుగుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరిగినప్పటికీ లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన రోజు. వృత్తి పరంగా కీలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఒక అనుకూల సంకేతం ఉత్సాహాన్నిస్తుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ సాధిస్తే ఆర్థికంగా మేలు జరుగుతుంది.
