Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి విశేష‌మైన ఆర్థిక లాభాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పరోపకారతత్వంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలు మీలో స్ఫూర్తిని, ఆనందాన్ని నింపుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఊహించని ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. కొత్త పనులు చేపట్టడానికి ఈ రోజు శుభప్రదంగా లేదు. వృత్తిపరంగా, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన చికాకులు అశాంతి కలిగిస్తాయి. ఈ రోజు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆటంకాలు రావచ్చు కాబట్టి వాయిదా వేయండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం కావు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, పదవీయోగం ఉంటాయి. వ్యాపారంలో అదృష్టం కలిసి వచ్చి లాభాలు పెరుగుతాయి. కీలకమైన వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. ఆర్థికంగా ఉన్నతస్థానానికి చేరుకుంటారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసే ఓ వ్యక్తి తారసపడతారు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే అనుకున్న ఫలితాలు పొందగలరు. మీ సామర్ధ్యం, కఠిన శ్రమతో ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. సమయానికి పనులు పూర్తి కాకపోవచ్చు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో కృషికి తగిన ప్రతిఫలం లభించక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలతో ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. స్థానచలనం, జీతం పెరుగుదల వంటి శుభ పరిణామాలు ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సహనం, ఓర్పుతో ఉంటే లక్ష్యాలను చేరుకోవచ్చు. పని ప్రదేశంలో వివాదాలు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారాన్ని పలు ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా లాభాలు పెరుగుతాయి. విశేషమైన ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధనలో ఆటంకాలు అధిగమిస్తారు. శుభకార్యాల్లో బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది.

Latest News